చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 15 పోలవరం జిల్లా చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం మరియు చరిత్ర విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘ సంస్కర్త మరియు ప్రథమ న్యాయ శాఖమంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్య ద్వారానే సాధికారత సాధ్యమని ఆయన నమ్మిన సిద్ధాంతాలను విద్యార్థులకు వివరించారు."చదువుకో, సంఘటితమవ్వు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని, సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం. శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యంగా యువత ఆయన బాటలో పయనించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి.సాయికుమార్ అధ్యాపకులు డాక్టర్ వై.పద్మ, డాక్టర్ కె.శకుంతల, ఎస్. అప్పనమ్మ,జి. హారతి, కె.శైలజ, ఆర్.మౌనిక,బి. శ్రీనివాసరావు,ఎన్.ఆనంద్, కె.లక్ష్మీ ప్రసన్నకుమారి, ఆర్.కిరణ్మయి, కె.కీర్తి మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.