జహీరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నివాళులర్పించిన సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, విద్య మరియు సంఘటిత శక్తి ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యునూస్, సిడిసి చైర్మన్ ముబీన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం నర్సింహులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కౌన్సిలర్లు జమిలోద్దిన్, జాఫర్, అక్రం, జహంగీర్, అతిక్ అక్కాని, నిజాం, మాజీ వైస్ ఎం.పి.పి రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అక్తర్ గోరి, ప్రతాప్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గోపాల్, ఇమామ్ పటేల్, బర్కత్, రాములు, పాండు యాదవ్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఈ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.