డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవం.

వివక్ష పై పోరాటం,రాజ్యాంగ రూపకల్పన...ఒక అజరామార ప్రస్థానం!

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.15.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం, ఇందుకూరు గ్రామపంచాయతీ ఇందుకూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా దేవీపట్నం మండల వైఎస్ఆర్ సిపి యూత్ కన్వీనర్ శరభవరం, దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ… అంటరానితనంతో కులవివక్షకు గురైన కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది.అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం సమాన అవకాశాలు, హక్కులు అందించి,ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు.అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మన ఇచ్చే ఘన నివాళి.భారత రాజ్యాంగ శిల్పి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నేడు.1891.ఏప్రిల్.14 న మధ్యప్రదేశ్ లో మోన్ ప్రాంతంలో రాజీ మాకోజీ సాక్వాల్, భీమాబాయి దంపతులకు ఆయన జన్మించారు.ఆయన అసలు పేరు భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్. ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన భీమ్ రావు రామ్ జీ చిన్నప్పటి నుంచే కుల వివక్షను ఆత్యంత దారుణంగా ఎదుర్కొన్నారు.పాఠశాలలో తోటి విద్యార్థులతో సమానంగా కూర్చొనే అవకాశం లేకపోయినా, చదువు ద్వారానే తన జీవితాన్ని,సమాజాన్ని మార్చగలవని ఆయన బలంగా నమ్మారు.ఆ పట్టుదలే ఆయనను ఉన్నత విద్య వైపు నడిపించింది.కుటుంబ నేపథ్యం మరియు సామాజిక పరిస్థితులను అధిగమించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన తొలి తరం భారతీయుల్లో ఆయన ఒకరు. విదేశీ గడ్డ పై పొందిన జ్ఞానం,అక్కడ ఎదురైన అనుభవాలు ఆయనను సామాజిక మార్పు కోసం పోరాడేలా పురికొల్పాయి.అంటారనితనం,కుల వివక్ష లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి నిరూపమనం.భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర అజరామరం అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఇందుకూరు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.