పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 15 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) :మండలంలో ఎర్రవరం హై రోడ్డుపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రజా హక్కుల న్యాయ పోరాట సంఘ సభ్యులు,జర్నలిస్టులు బాటసారులకు మజ్జిగ,లడ్డూలు మంగళవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని,అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని,భారత రాజ్యాంగ సృష్టికర్త,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా సుమారు వెయ్యి మందికి పైగా మజ్జిగ,లడ్డూలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మూర రాజశేఖర్,సాలెం రాజ్,డి.రాజు,రాజ్ కుమార్,నందు శ్రీనివాస్,వీరబాబు,కే.శివ,ఎం. బాబి తదితరులు పాల్గొన్నారు.