డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. బోయిన్ పల్లి గ్రామపంచాయతీలో మరియు అంబేద్కర్ కాలనీలో ని అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమాన్ని సర్పంచ్ పశుల శశికళ సారధ్యంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షం లో ఆ మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది.. ఇట్టి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు పసుల ప్రశాంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు.ఉపసర్పంచ్ రామస్వామి వార్డ్ నెంబర్లు, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.