
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 బోధన్ : బోధన్ పట్టణంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ సబ్ కలెక్టర్ బోధన్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ వార్డ్ నెం. 35 ను సందర్శించి డ్రెయిన్ల డీసిల్టింగ్ కోసం తాజాగా కొనుగోలు చేసిన మినీ ఎక్స్కవేటర్ పనితీరును పరిశీలించారు.మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వినియోగదారుల నుండి యూజర్ ఛార్జీలు సేకరిస్తూ ఇంటింటికీ చెత్త సేకరణ చేపట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నలుగురు డ్రైవర్లకు కొత్త శానిటేషన్ వాహనాన్ని అందజేశారు ఆ వాహనానికి సంబంధించిన ఇంధనం మరియు నిర్వహణ బాధ్యతలను సంబంధిత డ్రైవర్లే భరించాల్సి ఉంటుంది మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే వేసవి కాలంలో ఎలాంటి తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత 4.4 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ డబ్ల్యూటీపి పునరుద్ధరణ పనులను ప్రారంభించడంతో పాటు అవసరమైన చోట్ల అత్యవసర పైప్లైన్ పనులు చేపట్టాలని సూచించారు. 2బిహెచ్కే గృహాల లబ్ధిదారుల జాబితా ఖరారు ప్రక్రియను బోధన్ సబ్ కలెక్టర్ బోధన్ తహసీల్దార్ సమీక్షిస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులు నాయకులు మున్సిపల్ కార్మికుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు