పయనించే సూర్యుడు, 15 ఏప్రిల్ 2026, భీంగల్ మండల రిపోర్టర్ కొత్వాల్ లింబాద్రి , నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలోని శ్రీ విశ్వభారతి విద్యాలయానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు నేషనల్ మరియు స్టేట్ స్థాయిలో నిర్వహించనున్న టైక్వాండో కరాటే టోర్నమెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను భీంగల్ పట్టణ ఎస్.ఐ తిరుపతి చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ కరస్పాండెంట్ నీదిన్ రాజ్, అపర్ణా శృతి, అధ్యాపక బృందం మరియు కరాటే కోచ్ పాల్గొన్నారు.