పాతర్లపాడులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని హైస్కూల్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ ఓబినబోయిన లక్ష్మి-అచ్చయ్య ఉపసర్పంచ్ దారేల్లి సురేష్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ గారు సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు నూతన ఆశలు నింపి, ప్రపంచం అబ్బురపడేలా భారత రాజ్యాంగాన్ని అందించిన నవభారత నిర్మాతగా ఆయన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాధించటమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, అఖిలపక్ష నాయకులు, వార్డు సభ్యులు, ఎస్‌సి కాలనీ యువకులు, డీవైఎఫ్‌ఐ కమిటీ సభ్యులు, సీపీఎం, సిపిఐ, బీఆర్‌ఎస్, టీడీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.