బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 యాడికి, లేపాక్షి టైమ్స్, యాడికి మండలంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి కేక్ కట్ చేసి భారతదేశానికి ఆయన చేసిన సేవలు మనకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను గుర్తు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాతకుట్ల బాలు మాదిగ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస మాదిగ నియోజవర్గ కన్వీనర్ దేవరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నరసింహ, గాంధీ, సూర్యుడు, కుళ్లాయప్ప,శివ ,జగదీష్ శ్రీరాములు, వెంకట్ రాముడు,టైలర్ పుల్లయ్య, పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ కాలనీవాసులుపాల్గొనడం జరిగింది