భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్గొండ జిల్లా ఈరోజు తవక్లాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా *తవక్లాపూర్ గ్రామ సర్పంచ్ పొన్నగంటి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు అణగారిన వర్గాల సంక్షేమం మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ గారు చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు అలానే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమసమాజ స్వాప్నికుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా|| బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ అంగన్వాడి టీచర్స్ తవక్లాపూర్ గ్రామ ప్రజలు యువకులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది