రత్నవరంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యడు ఏప్రిల్ 15 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆశయ సాధనే అసలైన నివాళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వనపర్తి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పాతకోట్ల మధు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి, అంబేద్కర్ కన్న కలలను, ఆయన ఆశయాలను నిజం చేయడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన గౌరవమని పేర్కొన్నారు పాల్గొన్న ప్రముఖులు ఈ వేడుకల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీను, సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు మొలుగూరి ప్రభాకర్ రావు, నందిగామ రామారావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొలుగూరి సైదులు పాల్గొన్నారు. అలాగే గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి కలకొండ సాల్మన్, సహాయ కార్యదర్శి కంపాటి ప్రతాప్, ఉపాధ్యక్షులు విమలపంగు సైది బాబు తమ సేవలను అందించారు. హాజరైన ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఉప సర్పంచ్ కుంచం యాదగిరి ఈదమ్మ, వార్డు సభ్యులు కూరాకుల సతీష్, రామిని భూపాల్ రెడ్డి, కలకొండ వీరయ్య లక్ష్మి, మిర్యాల శ్రీను, కూరకుల వెంకటేశ్వర్లు, దున్న మిన్నయ్య, కూరకుల వెంకమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ పసుపులేటి వినయ వర్ధన్ బాబు, రామిని విజయవర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మొలుగురి ఉపేందర్, మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ వీర గోవిందు కూడా హాజరయ్యారు. గ్రామ పెద్దలు పగడాల ప్రభాకర్ రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పోలంపల్లి వెంకటేశ్వర్లు, రాజుల కృష్ణమూర్తి, సోమ శ్రీనివాసరావు, యరగాని వీరబాబు తో పాటు గ్రామస్థులు పసుపులేటి శ్రీరాములు, జడ ఉపేందర్, శ్రీకాంత్ రెడ్డి, మిరియాల అంజి, కొమ్ము రమణయ్య, మొలుగూరి రాములు, మొలుగూరి ఎంకన్న, బండారు శోభారాణి, మొలుగూరి రాంబాయి, మొలుగూరి వెంకటమ్మ, పాముల అలివేలు, గాలి వినీత తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం నుండి దాట్ల వినయ్, కలకొండ సంజీవ్, యుగంధర్, మొలుగూరి నాగరాజు, మొలుగూరి సైదులు, నాగరాజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.