రాజ్యాంగం రచించిన గొప్ప దేశభక్తుడు దళితుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు

పయనించే సూర్యుడు,కోరుట్ల ఏప్రిల్ 15 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గం నాయకులు డాక్టర్ యాజమనేని అనూప్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పాలిట ఆశాజ్యోతి అభాగ్యుల పాలిట భవిష్యత్ క్రాంతి అసమనాతాలని చీకటిని చీల్చి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వేకువ తెచ్చేందుకు వచ్చిన వేగుచుక్క కుల మత వర్గ వైశ్యములు లేని జాతి కోసం అహర్నియాలు శ్రమించిన దర్శనీకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతి దళితుడి పుస్తకంలో ఆయన అక్షరం భారత జాతికి దిక్కూచిగా నిలిచి కోట్లమంది బహుజనుల జాతకాలను మార్చిన మహా రచయిత పాలన దక్షకుడు అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పథకాలను రెప్ప రెప్పలాడించిన ధన్యజీవి అంబేద్కర్ రాజ్యాంగం రచించిన గొప్ప దేశభక్తుడు దళితుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఇటీ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షకులు, కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ,కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు ప్రధాన కార్యదర్శి ఏర రాజేందర్ చౌట్పల్లి సాగర్ నాయకులు మడవేని నరేష్ మ్యకల గణేష్,తులసి కృష్ణ,బిక్కం అశోక్ వివిధ పార్టీ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.