పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు పలాస అగ్నిమాపక కేంద్రం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ వద్ద ఉన్న పరికరాలను ప్రదర్శించి, వాటి వినియోగంపై వివరించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించే ఈ చలివేంద్రం ఉపయోగకరంగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.