వాడవాడలా అంబేద్కర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ముమ్మడివరం ప్రతినిధి *బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బిజెపి నాయకులు ఘన నివాళి కాట్రేనికోన ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు అయితా బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వడ్డీ పేట బంటుమిల్లి లక్ష్మీ వాడ చెయ్యరు గ్రామాలలో ముమ్మిడివరం మార్కెటింగ్ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి & డైరెక్టర్ మట్ట సూరిబాబు &బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. గొల్ల కోటి వెంకటరెడ్డి మాట్లాడుతూ అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. అలాగే బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ మట్టా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు