పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.15.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం శరభవరం గ్రామపంచాయతీ,శరభవరం స్వర్ణ గ్రామం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళుఅర్పించారు.దేవీపట్నం మండల వైఎస్ఆర్ యూత్ కన్వీనర్ శరభవరం, దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ…పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని సమాజంలో అంటరానితనం నిర్మూలన,వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు దేవీపట్నం మండల టీడీపీ పార్టీ మాజీ ప్రెసిడెంట్ ముండ్ర మధుసూదన్ రావు, జొన్నల నాని,కారం వంశీ, ట్రైబల్ హెల్పర్ ఆఫీసర్ మహేష్ శరభవరం స్వర్ణ గ్రామం సిబ్బంది బి.రాంబాబు, డి.వీర మణికంఠ తదితరులు పాల్గొన్నారు.