
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని వావిలేరు ఓబులాయపల్లి టీకెపాడు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను అందరినీ హాజరు పరిచి పోషకాహారం తయారు చేసుకునే విధానం ఏ విధంగా తయారు చేసుకుంటే పోషక విలువలు పోకుండా ఉంటాయి తెలియజేసి ప్రతి కుటుంబంలో చిరుధాన్యాలు పాలు గుడ్లు, ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో ఉండేటట్లు చూసుకొనవలెనని అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లలో గాని డబ్బాలలో గాని ఆహార పదార్థాలు ఏవి కూడా నిల్వలు ఉంచకుండా ఉండవలెనని బయట నుండి కవర్లలో ఎటువంటి ఆహారాలు తీసుకురాకుండా ఉండేటట్లు కుటుంబ సభ్యులందరూ కూడా బాధ్యత వహించి ప్లాస్టిక్ కవర్లు డబ్బాలు పూర్తిగా నివారించవలెనని తెలియజేసి అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో3 నుండి 6 ఆరు సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారా విద్య అంగన్వాడీ కార్యకర్తలు అందించడం జరుగుతుంది . ఈ విద్యను లో కాస్ట్ ఫ్రీ కాస్టు మెటీరియల్ తో ప్లే కార్డులు బొమ్మలు పిల్లలకు అవసరమైనటువంటి కథలు కార్డులు బంకమట్టితో బొమ్మలు కార్యాలయంలో నుంచి వచ్చే ప్రీస్కూల్ కిట్ నందు ఉన్నటువంటి మెటీరియల్ తోటి పిల్లలలో అన్ని రకాల అభివృద్ధిలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తల్లిదండ్రులకు తెలియజేస్తూ ప్రతి బిడ్డను కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపేలా తల్లిదండ్రులందరూ కూడా చర్యలు చేపట్టి వారి యొక్క శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ అభివృద్ధిలకు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలను అందించవలెనని తల్లిదండ్రుల కు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం నందు సూపర్వైజర్ ఎం పద్మ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు