అశ్వాపురంలో ఘనంగా అరైవ్- అలైవ్ 3వ రోజు కార్యక్రమం రోడ్డు భద్రతపై విద్యార్థుల ప్రతిజ్ఞ

అధ్యక్షత వహించిన అశ్వాపురం పంచాయతీ సర్పంచ్ బనోత్ సదర్ లాల్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 16, అశ్వాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్ - అలైవ్ అవగాహన కార్యక్రమం బుధవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ మరియు ప్రైమరీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ నుండి ప్రారంభమై గ్రామ పంచాయతీ ఆఫీస్ రోడ్డు, టీడీపీ సెంటర్, మరియు ఎస్ కే టి ఫంక్షన్ హాల్ రోడ్డు మీదుగా టీడీపీ సెంటర్ జంక్షన్ వరకు కొనసాగింది. అక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, స్థానికులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వాపురం గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరాలని కోరారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నవారు ఏ ఎస్ ఐ వీరభద్ర రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, పోలీస్ అదనపు దళాలు, ఉన్నత పాఠశాల హెడ్ మిస్ట్రెస్ జి యోగిత వేణి, ప్రాధమిక పాఠశాల హెడ్ మిస్ట్రెస్ గూగులోత్ సుశీల ఉపాధ్యాయ బృందం డి. రమాదేవి, ఎన్. జ్యోతి, కె. ప్రశాంతి కుమారి, జి.శేఖర్, శ్రీనా, ప్రసన్న, జి.హనుమంతరావు, కె.శ్రీ లక్ష్మి, డి. సుధ, ఎం.రమా దేవి, టి.పద్మావతి, బి.స్వరూప, డి.ఈరమ్మ, ఎన్.కృష్ణ, పి.పద్మ, యం.సూర్య కాంతం, వార్డు సభ్యులు కె.ధనలక్ష్మీ, సుమతి విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.