ఇళ్ల మధ్యలో కనిపించిన నాగపాములు. స్నేక్ క్యాచర్స్ చాకచక్యంతో రక్షణ

స్నేక్ క్యాచర్స్ జగన్. కార్తీక్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని సుబ్బయ్య కాలనీ 5వ వార్డు పరిధిలో శివ ఇంటి పరిసరాల్లో రెండు నాగపాములు కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు స్నేక్ క్యాచర్స్ జగన్ మరియు కార్తీక్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జగన్, కార్తీక్ సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా రెండు నాగపాములను పట్టుకున్నారు. ఈ ప్రక్రియలో ఒక పాము గాయపడినట్లు గుర్తించిన వారు, దానికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం పట్టుకున్న రెండు పాములను బుద్దరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనను గమనించిన స్థానిక ప్రజలు స్నేక్ క్యాచర్స్ సేవలను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.