పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ గ్రామంలో ఉపాధి హామీ పనుల ప్రారంభం గ్రామాభివృద్ధికి నూతన దిశగా నిలిచింది. బుధవారం కిందికుంట వద్ద ఈ పనులను సర్పంచ్ అనురాధ రమేష్ ప్రారంభిస్తూ, ఉపాధి హామీ పథకం గ్రామ ప్రజల ఆర్థికాభివృద్ధికి ముఖ్య సాధనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామంలోని కూలీలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథక ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే కుంటల అభివృద్ధి ద్వారా నీటి వనరులు పెరగడం, భూ సంరక్షణ మెరుగుపడడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం జరుగుతుందని వివరించారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని అనేక కుటుంబాలకు ఉపాధి లభించనుండటం ఆనందకర విషయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు