ఉషోదయ కాలేజీలో ఇంటర్ సెకండ్ విద్యార్థుల ప్రభంజనం

★విద్యార్థులకు సన్మానించిన జిల్లా పోలీస్ కమిషనర్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 బోధన్: బోధన్ మండల కేంద్రంలో ఉషోదయ ఇంటర్మీడియట్ మహిళా కళాశాలలో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఎంఈసి తదితర కోర్సులలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు బుధవారం ఘనంగా శాలువాతో సన్మానించి విద్యార్థిని విద్యార్థులకు అభినందించారు ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ఉషోదయ ఇంటర్ మహిళా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సంపాదించడం ఎంతో అభినందనీయమని భవిష్యత్తులో అనేక ర్యాంకులు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎల్లవేళల తల్లిదండ్రులు కన్నటువంటి కలలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని , తల్లిదండ్రులు కన్నటువంటి కలలు నిజం చేసినప్పుడే మన చదువుకు సార్ధకత అవుతుందని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటినుండి కష్టపడే గుణం ఉన్నప్పుడే త్వరితగతిన భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు స్థిరపడతారని తెలియజేశారు రమాకాంత్ ఫంక్షన్ హాల్ యందు కాలేజీ అన్వాల్ డే సెలెబ్రేషన్స్ పాల్గోని అందులో విద్యార్థిని విద్యార్థులతో ట్రాఫిక్ నిబంధనకు సంబంధించినటువంటి అరివ్ అలైవ్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. విద్యార్థులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని అన్నారు ఈ సందర్భంగా ఉషోదయ డిగ్రీ కాలేజీ చైర్మన్ ప్రకాష్ డైరెక్టర్ దుష్వంత్ బోధన్ ఎసిపి శ్రీనివాస్ బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు