పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 16 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షెరీన్ బేగం ఆదేశాల మేరకు జగ్గయ్యపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గరికపాడు చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వాహనదారులకు రహదారి భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు గురించి వివరంగా అవగాహన కల్పించబడింది. హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, సీటు బెల్ట్ వినియోగం, వేగ పరిమితులను పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచనలు ఇవ్వబడినవి. అలాగే మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమని తెలియజేయబడింది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి వివరించి, వాటి కారణాలు మరియు నివారణ చర్యలపై చర్చించడం జరిగింది. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతకూ సహకరించాలని సూచించబడింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
