పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 16 : చండూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక బుధవారం స్థానిక మున్సిపల్ సమావేశం మందిరంలో నిర్వహించారు. చండూరు మున్సిపాలిటీ లో నూతనంగా ఏర్పాడిన నూతన పాలక వర్గం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ను బుధవారం అధికారులు పూర్తిచేశారు. అన్ని పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కా యి. మొత్తం 10 మంది కౌన్సిలర్లు అందులో 7 గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా వారు ఆమోదించిన సభ్యులే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రమే నామినేషన్ వేశారు .నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులు పాలకవర్గంతో కలిసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతనంగా ఎంపికైన కోఆప్షన్ సభ్యులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే ఖలీల్ , కల్లెట్ల చంద్రకళ మారయ్య , ఎం డి సలీమా షరీఫ్ , మొగుదల సత్తెమ్మ , కు నియామక పత్రాలను మున్సిపల్ కమిషనర్ మల్లేష్ అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు , వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు ,కోడి సుష్మ ,కల్మికొండ పారిజాత, కటకం రమేష్, జల్ల ధనమ్మ , తదితరులు పాల్గొన్నారు.