తిమ్మాపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం లు ..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూగత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను రద్దుచేసి పేదవాడిని ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభమయ్యాయి అని ఈరోజు పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరమైన చోట్ల అన్నా క్యాంటీన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగానే 207 అన్న క్యాంటీన్ లను ఈరోజు పల్నాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్ గా ప్రారంభించారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వ అనేక పథకాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ముందుగా మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు దుస్సాలువతో మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు ఎమ్మెల్యేకు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం ఎమ్మెల్యే నానాజీ, ఎమ్మెల్సీ రాజశేఖర్,టిడిపి కార్య నిర్వహణ కార్యదర్శి కటకం శెట్టి బాబి, కూటమి నాయకులు పెంకె శ్రీనివాస బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి, పాండ్రంకి రాజు కూటమి సభ్యులు భోజనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ సతీష్, బండారు మురళి,కూటమి నాయకులు మాదారపు తాతాజీ యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.