పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి బిజెపి జమ్మికుంట పట్టణ ప్రధాన కార్యదర్శి గా కైలాసకోటి గణేష్ ను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ ప్రధాన కార్యదర్శిగా నియమించిన కేంద్రమంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, సహకరించిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. రాబోయే రోజులలో తన పై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి అందరితో కలిసి సమిష్టి కృషితో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.