పయనించే సూర్యుడు ఏప్రిల్ 16-4-26 కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ జైనూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ సబ్ టైటిల్ :మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషి ఫలితంగా వార్తా విశ్లేషణ :జైనూర్ : మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషి ఫలితంగా మేటిగుడా గ్రామానికి అవసరమైన షెడ్ మంజూరు అయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్ తెలిపారు. మంగళవారం బాబ్జిపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ : మా గ్రామానికి ఎంతో అవసరమైన షెడ్ మంజూరు చేయించిన ఆత్రం సక్కు ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం, అని తెలిపారు.