రంగారెడ్డి జిల్లా స్థాయి నాయకుల విస్తృత సమావేశం – పార్టీ బలోపేతంపై చర్చలు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 16 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యా లయంలో నూతనంగా నియమితులైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బుందరపు నరసయ్య గౌడ్ సమక్షంలో రంగారెడ్డి జిల్లా స్థాయి నాయ కులు విస్తృత సమావేశం నిర్వహిం చారు.సమావేశంలో పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయిల వరకు విస్తరించి, పార్టీ ఆదేశాలు,ఆశయా లను ప్రతి ఇంటికి చేరేలా చేయాలని నాయకులు చర్చించారు.ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల్లో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహి ళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ కార్యకలాపాల్లో వారికి మొదటి అవకాశం కల్పించాలని సూచించారు.పార్టీ అభివృద్ధి దిశగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని, ప్రజల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ పార్టీని బలంగా నిలబెట్టాలని నిర్ణ యించారు.ఈ సమావేశం పార్టీ శ్రేణు ల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో రంగారెడ్డిజిల్లాలో టిఆర్పి మరింత బలోపేతం అవుతుం దని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ మహిళ అధ్యక్షురాలు బండా రు విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి, ఉపాధ్యక్షులు పొనుగోటి సందీప్, అధికార ప్రతినిధి శాఖరోళ్ల సురేష్ ముదిరాజ్,యూత్ ప్రెసిడెంట్ శాగంటి శ్రీనివాస్, మద్దె గూడెం జనార్దన్ ముదిరాజ్, బొంగు వేంకటేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.