రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాణిజ్య సదుపాయాలను ఈరోజు కీసర మండల ఆఫీసులో వేలంపాట

పయనించే సూర్యుడు) కీసర, ఏప్రిల్ 16 మేడ్చల్ జిల్లా, కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, కొర్రముల, చైతన్య నగర్, రాంపల్లి, చర్లపల్లి పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ వద్ద గల వాణిజ్య సదుపాయాలను ఈరోజు కీసర మండల ఆఫీసులో వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ పరిధిలోని ఆర్డిఓ ఎమ్మార్వోలు డిప్యూటీ తాసిల్దారులు, వేలంపాటలో పాల్గొన్న టెండర్ దారులు. ఈ టెండర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వీడి గత ప్రభుత్వం వేలకోట్ల పెట్టుబడి పెట్టి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ బిల్డింగ్స్ మెయింటెనెన్స్ కు వినియోగించుకునేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని కూడా సొమ్ము చేసుకోవడాన్ని సిపిఎం పార్టీ తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన వాణిజ్య సదుపాయాలను ఈ ప్రభుత్వం వేలం వేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంగా సిపిఎం పార్టీ అభివర్ణించింది.