వంకాయలపాడు గ్రామానికి చెందిన విద్యార్థి ప్రతిభకు ప్రశంసల వెల్లువ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 యడ్లపాడు మండల ప్రతినిధి వంకాయలపాడు గ్రామానికి చెందిన షేఖ్ షౌకత్ అలీ ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 464 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. చిలుకలూరిపేట పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఆయన, ఈ ఉత్తమ ఫలితాలతో కాలేజీలో రెండవ స్థానం సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. షౌకత్ అలీ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, ఆ లోటును అధిగమిస్తూ కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. తల్లి షేక్ మహబాబీ ప్రేమ, ప్రోత్సాహంతో పాటు తాతయ్య షేక్ పెద్దనాగుల మీరా మరియు నాన్నమ్మ హుస్సేని అండతో ముందుకు సాగుతూ విద్యలో మంచి ఫలితాలు సాధించాడు. ఈ సందర్భంగా షౌకత్ అలీ సాధించిన విజయానికి గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు మరియు పరిచయస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు