శాతవాహన జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం హరిపురంలో గల శాతవాహన జూనియర్ కళాశాల: గత 24 సంవత్సరాలుగా నిరంతరం ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ, బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది.సీనియర్ ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు గాను బర్సారంపురం గ్రామానికి చెందిన ఎర్ర అంకిత 975 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. మనసా గ్రామానికి చెందిన కదిరి బిందు శ్రీ 974 మార్కులు, మంచ గ్రామానికి చెందిన శివాని పండ 973 మార్కులు సాధించి కళాశాల ప్రతిష్టను మరింత పెంచారు.జూనియర్ ఇంటర్మీడియట్‌లో 470 మార్కులకు గాను హరిపురం గ్రామానికి చెందిన గోకర్ల జాషున 450 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.మొత్తం ఫలితాల్లో 900 మార్కులకు పైగా 26 మంది విద్యార్థులు, 400 మార్కులకు పైగా 38 మంది విద్యార్థులు ప్రతిభ కనబరచగా, జూనియర్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిపి 76 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం. విద్యార్థులకు క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కలగలిపి ఈ విజయానికి కారణమని కళాశాల యాజమాన్యం తెలిపింది.ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కళాశాల మేనేజ్‌మెంట్ హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసింది.