శేరిలింగంపల్లి జోన్‌లోసమీక్షా సమావేశం:సిఎంసి కమిషనర్సృజన ఐఏఎస్,

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 16 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరుగు తున్న వివిధ అభివృద్ధి పనులు,ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమి షనర్ శ్రీమతి జి సృజన ఐఏఎస్ బుధవారం జోనల్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఐఏఎస్., ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, యూబీడీ (యు బి డి),యూసీడీ(యుసి డి) విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలోని ముఖ్య అంశాలు: గడువులోగా పనులు పూర్తి: ప్రస్తుతం కొనసాగుతున్న పనులన్నింటినీ '99 రోజుల ప్రోగ్రాం'లో భాగంగా జూన్ 2nd, 2026 లోపు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. కనీసం 190 పనులను ఈ గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.రోడ్ల నిర్వహణ: జోన్‌లోని అన్ని రోడ్లకు ఎండ్-టు-ఎండ్ కార్పెటింగ్ చేయాలని, ఎక్కడా గుంతలు లేకుండా జూన్ 2 లోపు మరమ్మతులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అలాగే రోడ్లపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగిం చాలని ఆదేశించారు.మురుగునీటి కాలువల పూడికతీత: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ చివరి నాటికి జోన్ అంతటా పూడికతీత పనులు (డెసిల్టింగ్) పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు.ప్రజా సమ స్యల పరిష్కారం: వీధి దీపాల సమస్యల పై అసిస్టెంట్ ఇంజనీర్లు తక్షణ మే స్పం దించాలని, ప్రజల ఫిర్యాదులను ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని సూచించా రు.ఆస్తుల వివరాలు: క్రీడా ప్రాంగణాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి ప్రభుత్వ ఆస్తుల పూర్తి సమాచారాన్ని సేకరించాలని, ఖాళీ స్థలాలకు 10 రోజుల్లోపు హద్దులు (బౌండరీ ఫిక్సేషన్) ఏర్పాటు చేయాల ని ఆదేశించారు.పరి శుభ్రత & దోమల నివారణ: చెరువుల్లో గుర్రపుడెక్క తొల గింపు మే చివరి నాటికి పూర్తి కావాలని, దోమల నివారణకు ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రతి ప్రాంతంలో ఫాగింగ్/స్ప్రే యింగ్ జరిగేలా షెడ్యూల్ రూపొం దించాలని కమిషనర్ తెలిపారు.జంక్షన్ల అభివృద్ధి: జంక్షన్ల సుందరీకరణకు ప్రా ధాన్యత ఇవ్వాలని,ఇందుకోసం కార్పొ రేట్ సంస్థల సామాజిక బాధ్యత (సిఎస్ ఆర్) నిధులను విని యోగించుకోవాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిం చకుండా,విభా గాల మధ్య సమన్వయం తో పనిచేస్తూ లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని కమిషనర్ అధికారు
లను ఆదేశించారు.పురోగతిని పర్య వేక్షించేం దుకు ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.