సత్య–సందీప్ రిసెప్షన్ సందడి… ముఖ్య అతిథిగా లాయర్ పులగం రామకృష్ణారెడ్డి..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో నిర్వహించిన సత్య ఆకాంక్ష – సందీప్ కుమార్ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ లీగల్ అడ్వైజర్ & ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్య ఆకాంక్ష, సందీప్ కుమార్ ల వివాహం ఇటీవల దవళేశ్వరం లోని ముత్యమాల కన్వెన్షన్ హాల్‌లో సాంప్రదాయబద్ధంగా జరిగింది. కాకినాడ ఇంద్రపాలెంలోని పిల్లి అనంత లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో రిసెప్షన్ మరియు విందు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా లాయర్ పులగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నూతన దంపతులు సత్య ఆకాంక్ష మరియు సందీప్ కుమార్ దాంపత్య జీవితం ఆనందంగా, సుఖశాంతులతో, పరస్పర గౌరవం మరియు ప్రేమతో నిండిపోవాలని ఆకాంక్షించారు. వారి జీవిత ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదించారు. అలాగే, ఈ కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కీర్తిశేషులు చీకట్ల రవి కుమార్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన మరణం కుటుంబానికి మరియు పరిచయ వర్గాలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి శ్రీమతి సరిత గారి ధైర్యాన్ని అభినందించారు. రవి కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబంపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని, సరిత మరింత ధైర్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.