పయనించే సూర్యుడు, ఏప్రిల్ 16, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలం, గోపాల్ నగర్ గ్రామంలో గత ఏడు సంవత్సరాలలో గ్రామానికి వచ్చిన నిధులు, వాటి ఖర్చులు ,అభివృద్ధి పనులు ,ఉపాధి హామీ పథకం, ఇండ్ల లబ్ధిదారులు, సమావేశాలు, భూమి అనుమతులు, మిగతా కార్యక్రమాల గురించి జరిగిన అభివృద్ధి గురించి ప్రభుత్వ నిధుల గురించి వివరాలు ఇవ్వాలని కార్యదర్శికి సమాచార హక్కు చట్టం ద్వారా సిరిపాటి ఐలయ్య (సిరిపాటి అరుణ్ కుమార్) విజ్ఞాపన పత్రం అందజేశారు.