డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన కూటమి నాయకులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 20, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు వాకలపూడి గ్రామ దేవత అయిన గంగలమ్మ అమ్మవారి ఆలయంలో, దుర్గమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మానేపల్లి మంజునాథ్ మరియు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు మాత లక్ష్మణ్ లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయు ఆరోగ్యంగా కోరుకునే నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని వాకలపూడి గ్రామ దేవత అయిన గంగాళం తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, అలాగే దుర్గమ్మ ఆలయంలో త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించమన్నాను. ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ ఆలయాలను దేవాలయాలను మసీదులను ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అని అన్నారు. ఈ పూజా కార్యక్రమం లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కనిగిరి సత్యనారాయణ, మానేపల్లి పండు, యజ్జల దుర్గాప్రసాద్ మరియు ఓటమి నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.