సమానత్వం కోసం పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్.

పయనించే సూర్యుడు20-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) ​జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, శాతల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న 'డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ' కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిల్వకోడూరు గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి, హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ​అనంతరం దాసరి తిరుపతి మాట్లాడుతూ. భారతదేశం అనే దేశం గొప్ప సంస్కృతి, వైవిధ్యాల సమాహారం. కానీ అదే సమయంలో కులవ్యవస్థ అనే సామాజిక వ్యాధి ఇంకా మన సమాజాన్ని వెంటాడుతూనే ఉంది.ఈ వ్యవస్థను నిర్మూలించడానికి బి.ఆర్. అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్,గారీ వంటి మహానుభావులు తమ జీవితాలను అర్పించారు. వారు కేవలం మాటల్లో కాదు, కార్యాచరణలోనూ సమానత్వం కోసం పోరాటం చేశారు. అంబేద్కర్ గారి ఆశయం స్పష్టంగా ఒకటే — “మనిషిని కులంతో కాదు, అతని ప్రతిభతో గుర్తించాలి.” ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. జగ్జీవన్ రామ్, కూడా సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారు అన్ని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు సిరికొండ తిరుపతి, బాబు జగ్జీవన్ రావ్ సంఘం అధ్యక్షులు జేరిపోతుల కొమరయ్య, ఉపాధ్యక్షులు తుడుం నరసయ్య, చిల్వాకోడూరు గ్రామ వార్డు సభ్యులు నాగయ్య, ఓరగంటి మల్లయ్య, కంపల్లి మానస శ్రీకాంత్, ఓరగంటి లచ్చయ్య, చెవులమద్ది సతీష్,సిపెల్లి శంకర్, జేరిపోతుల అంజయ్య, తదితరలు అంబేద్కర్ వాదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.