పయనించే సూర్యుడు న్యూస్ 27- 12- 25, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పలు మృతదేహాలకు నివాళులర్పించి, వారి కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్బంగా చివ్వెంల మండల కేంద్రంలో కరెంట్ షాక్ తో మృతి చెందిన తండ్రి మాదాసు బుచ్చయ్య, చిన్న కుమారుడు మాదాసు లోకేష్ ల మృతదేహాలకు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో పూలమాలలు వేసి నివాళులర్పించి, అలాగే గుంపుల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన నాతాల నారాయణమ్మ మృతదేహానికి నివాళులర్పించి, అదేవిదంగా లక్ష్మి నాయక్ తండలో అనారోగ్యంతో మృతి చెందిన బానోత్ లక్ష్మణ్ నాయక్ మృతదేహనికి పూలమాలవేసి నివాళులర్పించి వారి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు.
