థియేటర్లో తినుబండారాల ధరలు ఆకాశమే హద్దు థియేటర్ల యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం

* తినుబండారాల విషయంలో నిలువు దోపిడీ * మరుగుదొడ్లు మూత్రశాలలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి * ప్రభుత్వ అధికారుల మొండివైఖరి థియేటర్ల తనిఖీలలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం * ప్రభుత్వ అధికారులపై సినిమా ప్రేక్షకులు ఆగ్రహం * తినుబండారాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి పట్టించుకోని ఆహార భద్రత అధికారులు * ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక తో సంబంధం లేకుండా అక్రమ వ్యాపారం * ప్రభుత్వ అధికారులకు థియేటర్ యాజమాన్యం ద్వారా ముడుపులు అందుతున్నాయి

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి థియేటర్లకు వినోదం కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విక్రయించే తినుబండారాల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ థియేటర్, ఈ థియేటర్ అనే తేడా లేదు. థియేటర్ స్థాయి బట్టి ధరలు మోత మోగుతున్నాయి. సినిమా టికెట్టు కంటే వాటర్ బాటిల్ స్నాక్స్, పాప్కార్న్, టీ, కాఫీ, కూల్డ్రింక్స్ సమోసా ధరలే అధికం. టికెట్ ధరలతో పాటు తినుబండారాల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి పై భారం రోజురోజుకీ పెరుగుతోందని ప్రేక్షకులు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు, ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా మారిపోయాయని ఇప్పటికే సినిమాకి వెళ్ళాలంటే కనీసం ₹1,500 నుంచి ₹2,000 వరకు ఖర్చవుతోంది. ఒక కుటుంబం సినిమా చూడాలంటే భారంగా మారింది. థియేటర్ యాజమాన్యంపై ప్రభుత్వ యంత్రాంగ ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి తినుబండారాల అధిక రేట్ల విషయంలో జోక్యం చేసుకొని ప్రతి సామాన్య కుటుంబానికి న్యాయం జరిగేలా ధరలను తగ్గించే మార్గాన్ని ఏర్పాటు చేయాలి ఖమ్మం జిల్లా సినిమా ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు థియేటర్ల యాజమాన్యంపై చర్యలు ఉంటాయా ఉండవా అనేది వేచి చూడాలి మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *