
పయనించే సూర్యుడు, డిసెంబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ తంగల్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్‌తో పాటు వార్డు సభ్యులు పత్యం శేఖర్, గంధం రాజు, గంధం యాదగిరి, సత్యపాల్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామాపూర్లోని కెకె మహేందర్ రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో వీరి పార్టీలో చేరిక జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షులు దాకూరి మాధవ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కెకె మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి నూతన సభ్యులను ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనపై నమ్మకంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని కెకె మహేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్, గుగ్గిళ్ళ శ్రీకాంత్, బైరీనేని రాము, సత్తు శ్రీనివాస్, మాధవ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.