పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 27, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన కాంపల్లి సూర్య ప్రకాష్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఏ) వారు నిర్వహించె తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ కి ఖమ్మం జిల్లా జట్టు తరుపున ఎపింకయ్యాడు. వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ లో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరిగే టోర్నమెంటులో ఆడనున్నాడు. జిల్లా జట్టుకు ఎంపిక అవ్వటం పట్ల నారాయణపురం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుండి ఆటల్లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగి జిల్లా జట్టుకు ఎంపీ కావడం హర్సనీయమన్నారు. నారాయణపురం గ్రామస్తులతో పాటు తల్లాడ మండల నాయకులు అతనికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి రాణించాలని ఆకాంక్షించారు.
