పయనించే సూర్యుడు డిసెంబర్ 27 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: వేములవాడ భీమన్నను దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ కు బోనం చెల్లించుకోవడం ఆనవాయితీ. బద్ది పోచమ్మ గుడి ముందు కొబ్బరికాయలు కొట్టే చోట రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి గుంతలో నీరు నిలచి భక్తులకు ఇబ్బందిగా మారింది.భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి కొబ్బరి కాయ కొట్టి మొక్కులు చెల్లించుకునే సమయంలో భక్తులకు అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటువైలు వెళ్లే వాహనదారులు గుంతతో నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని సమయాల్లో స్వల్ప ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరుసగా సెలవులు రావడం, సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో భక్తుల తాకిడి ఎక్కువవుతోంది.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశం కావున గుంతతో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం పొంచి ఉందని,సంబంధిత అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదం జరగక ముందే గుంతను మరమత్తులు చేసి భక్తులు ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకునేలా చూడాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.
