పయనించే సూర్యుడు డిసెంబర్ 27 (ఆత్మకూరు నియోజకవర్గం పరిధినిధి మన్నేపల్లి తిరుపతయ్య) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన చేజర్ల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం తాసిల్దార్ మస్తానయ్య పోలింగ్ బూత్ స్థాయి అధికారులు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోలింగ్ బూత్ స్థాయి అధికారుల సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ మస్తానయ్య మాట్లాడుతూ బి ఎల్ వో లు పోలింగ్ బూత్ స్థాయిలో ఫ్యామిలీ నెంబర్ మ్యాపింగ్ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చేజర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజురుద్దీన్. రావి పెంచల్ రెడ్డి. బిజెపి జిల్లా వడ్డెర డైరెక్టర్ బత్తల. కృష్ణయ్య. ఏ ఎస్ ఓ. భక్తవశనం. ఆర్ ఐ .సతీష్. మండలంలోని అన్ని బూత్ స్థాయి అధికారులు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి. బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
