పయనించే సూర్యుడు డిసెంబర్ 27 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :శంకరపట్నం మండల పరిధిలోని ధర్మారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 5 సంవత్సరాల నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నూతన పాలకవర్గం, పాఠశాల సిబ్బంది శుక్రవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలని మక్కువతో ప్రభుత్వ పాఠశాలలను మరచిపోతున్నారని, ఉన్న ఊరు బడి కన్నతల్లి లాంటిదని గ్రామ సర్పంచ్ చింతిరెడ్డి పద్మ అన్నారు. దానిని కాపాడుకునే బాధ్యత గ్రామంలో ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు అమ్మబడి కార్యక్రమం ద్వారా లక్షలు వెచ్చించి ఏడాది క్రితం పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించారాని, పిల్లలకు విద్యాబోధన విషయంలో శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపు రాజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఎలుకపల్లి సుధీర్, ఉప సర్పంచ్ కనకం నాగేశ్వరి, వార్డు సభ్యులు రెడ్డి ఐలయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది దేవునూరి మల్లేష్, దేవునూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు