కాట్రావులపల్లి హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

పయనించే సూర్యుడు డిసెంబర్ : 27 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని బచ్చు ఫౌండేషన్ ఏలేటి పెద్ద వీరన్న మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు కీర్తిశేషులు ముసిరెడ్డి ఆంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు ముసిరెడ్డి ఆదినారాయణ, ముసిరెడ్డి నాగేశ్వరరావు, ముసిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని అన్ని సబ్జెక్టులను సమగ్రంగా, సులభంగా అర్థం చేసుకునే విధంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు మేధస్సును పెంపొందించే విధంగా ఈ స్టడీ మెటీరియల్ రూపొందించామని తెలిపారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకొని ఫస్ట్ క్లాస్ మార్కులతో 100 శాతం ఉత్తీర్ణత సాధించి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ హైస్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని, అలాగే క్రీడా రంగంలో కూడా అనేక పతకాలు సాధించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సుంకర సీతారామయ్య, కంటే రామారావు, సుంకర రవి, బిక్కిన బాబి, రాయుడు శివ, రాయపాటి బాబురావు, పెద్దాడ వెంకన్న, కాకరపల్లి కామేశ్వరరావు, చంద్రమౌళి చిట్టి, షేక్ మొగలావళి, దమర్ సింగ్ మధు, పోలినాటి ఎజ్రా శాస్త్రి, కానేటి ప్రసాద్, లంక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *