కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి,

పయనించే సూర్యుడు, డిసెంబర్ 27 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి, కేటీఆర్ సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుకట్‌పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు నాయకత్వంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.అలాగే ఆయనతో పాటు వేలాది మంది బీఆర్ ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సీ శంభిపూర్ రాజు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమటి సాయి బాబా, చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, వల్ల హరీష్ రావు, కొండాపూర్ డివిజన్ నాయకుడు అల్లావుద్దీన్ పటేల్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా వాడుతున్న అసభ్యకర భాష మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.హైదరా బాద్‌ను అభివృద్ధి చేసిన గొప్ప నాయ కుడు కేటీఆర్ అని కొనియాడారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోవడం లేదని అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచామని మాధవ రం గుర్తుచేశారు.బీఆర్ఎస్ సింగిల్‌గా జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసు కుందని తెలిపారు.కార్యకర్తలు, ప్రజలను కాపాడుకున్నవాడే నాయకుడు అవుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయినందన్ ముదిరాజ్,పవన్,శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, మజీద్, సంతోష్, శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్‌ ఎస్ సీనియర్ నాయకుడు, కార్యక్రతలు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *