రైతు సేవా సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 27.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జే నాగరాజ) స్థానిక ఎంపీడీవో కార్యాలయ సముదాయంలో శుక్రవారం పుంగనూరు డివిజన్ రైతు సేవా కేంద్రం సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సి. శివకుమార్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో ఏ డి ఏ మాట్లాడుతూ రబీ 2025-26 సంబంధించి ఈ పంట నమోదు కార్యక్రమం వేగవంతం చేయవలెనని మరియు సాగులో ఉన్న ప్రతి పంట ఈ పంటలో నమోదు కావాలని తెలిపారు క్రాప్ బుకింగ్ లో నమోదు చేసినటువంటి రైతులకు మాత్రమే తదుపరి యూరియా అందజేయడం జరుగుతుందని కాబట్టి పంట వేసిన ప్రతి ఒక్క రైతు ఈ పంటనునమోదు జరగాలని తెలియజేశారు. ఏపీ ఏ ఐ ఎం ఎస్ యాప్ కనీసం 300 మంది రైతుల మొబైల్లో ఇన్ స్టాల్ చేయించి ఆ యాప్ ద్వారా వ్యవసాయ సమాచారం ఎలా తెలుసుకోవాలో రైతులు అవగాహన కల్పించాలి అని తెలిపారు. ప్రతి రైతు సేవా కేంద్రం సిబ్బంది ప్రస్తుత పంటలు సాగు దృష్టిలో పెట్టుకొని ఎరువుల అవసరం కనుగొని ఎరువుల కొరత లేకుండా ముందుగానే ఇండెంట్స్ పెట్టి ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని చెప్పారు ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారులు మోహన్ కుమార్, రాధ, జ్యోతమ్మ, సుధాకర్, శ్రావణి, లీలకుమారి మరియు ఏ ఈ ఓ లు శివ శంకర్, ఖాదర్ వల్లి, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *