మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల నిరసన

* కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం ఇచ్చిన డి జె ఎఫ్ (డబ్ల్యూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28 మందమరి మండలం రిపోర్టర్ బొద్దుల భూమయ్య జర్నలిస్ట్ సంఘాల పిలుపుమేరకు జర్నలిస్ట్ అక్రిడేషన్ లపై కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ రాష్ట్ర ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ జిల్లా అధ్యక్ష కమిటీ సభ్యులు డీ జే ఎఫ్ వర్కింగ్ సంఘాలు కొట్లాడిన ఫలితంగానే ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీ తీసుకొని రావడం జరిగిందని కానీ అందులో లోపాలు ఉన్నాయి దాన్ని సరి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఒకసారి 252 జీవో పైన మళ్లీ పునర్ ఆలోచించుకోవాలని కోరుతున్నామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జర్నలిస్ట్ అక్రిడేషన్ జీవో నెంబర్ 252 ను వ్యతిరేకిస్తూ శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం సమర్పించారు జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ నూతన జీవోలోని నిబంధన వల్ల అర్హులైన అనేకమంది జర్నలిస్టులు అక్రిడేషన్ కు దూరం అవుతున్నారని ఇది జర్నలిస్టుల హక్కులను హరించే చర్య అని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *