పయనించే సూర్యుడు డిసెంబర్ 28 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య :మొలంగూర్ గ్రామం చెమిలాడ బోడుకు వెళ్లే దారిలో గల బ్రిడ్జి పూర్తిగా శిథిలవస్థకు చేరింది నివాసస్థులకు రాకబోకులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వందలాది ఎకరాలకు ఇట్టి బ్రిడ్జి నుండే వాహనాల ద్వారా రైతులు రాకపోకలు నిత్యం కొనసాగుతాయి బ్రిడ్జిపై గుంతలు ఏర్పడ్డాయి చుట్టుపక్కల నెర్రెలు వాసాయి పాత బ్రిడ్జికి ఇరువైపులా ఎలాంటి రక్షణ లేదు వర్షాకాలంలో లొందలు పడి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది . కావున మండల పంచాయతీ అధికారులు నీటి పారుదల శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే చొరవ తీసుకోని నూతన బ్రిడ్జిని నిర్మాణం కోసం కృషి చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో గ్రామ ప్రజలను కలుపుకొని పలు నిరసన కార్యక్రమాలతో పాటు బ్రిడ్జిపైనే వంటా వార్పు కార్యక్రమాలు చేపట్టి అట్టి బ్రిడ్జిపై నిద్రిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మోరె గణేష్ తో పాటు దాసరపు ఆనంద్ దాసరపు శివ సాయి మోరే అజయ్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు