అంగరంగ వైభవంగా సాయిమల అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం

* ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

పయనించే సూర్యడు /డిసెంబర్ 28/కాప్రా ప్రతినిధి సింగం రాజు కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబానగర్ కాలనీలో ఉన్న సాయిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలను శనివారం భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీ సాయిమల అయ్యప్ప స్వామి వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్ రేగళ్ల సతీష్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణపతి హోమం, అభిషేకం, కలశాభిషేకం, ఊరేగింపు, పుష్పార్చన, మహా పడిపూజ వంటి కార్యక్రమాలను పురోహితులు శివ కార్తీక్, వినీత్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. అలాగే మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య కూడా పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు క్రమశిక్షణతో స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపించింది. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ రేగళ్ల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరినాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శేఖర్ చారి, కోశాధికారి కేఏఎన్ ప్రసాద్‌తో పాటు నాయకులు పండాల యాదగిరి గౌడ్, సంభన బోలు హరి గౌడ్, కనుకుల రజినీకాంత్ రెడ్డి, నవీన్ గౌడ్, శివకుమార్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *