పయనించే సూర్యుడు డిసెంబర్ 28(మేడ్చల్ నియోజకవర్గం మాధవరెడ్డి) ఘట్కేసర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్గా శ్రీమతి వాణిరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని వాణి తెలిపారు. సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు