పయనించే సూర్యుడు డిసెంబర్ 28, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పడిచచ్చే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. తాజాగా ఆదోని పట్టణానికి చెందిన ప్రభాస్ వీరాభిమాని గోపి, తన అభిమాన నటుడి కుటుంబంపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రభాస్, త్వరలో ‘రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ హంగామా మొదలైన తరుణంలో, గోపి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని దివంగత కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. అక్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవిని మర్యాదపూర్వకలగా కలిశారు. ఈ సందర్భంగా గోపి ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ప్రభాస్ పట్ల తనకున్న అభిమానాన్ని వివరిస్తూ, గతంలో తాను చేసిన సేవా కార్యక్రమాలు మరియు ప్రభాస్ ఫొటోలతో కూడిన ప్రత్యేక ఆల్బమ్‌ను ఆమెకు చూపించారు. గోపి చూపిస్తున్న అంకితభావాన్ని చూసి శ్యామలా దేవి అభినందించారు. గోపి మాట్లాడుతూ: ప్రభాస్ మాకు కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి. వారి కుటుంబ సభ్యులను కలవడం చాలా ఆనందంగా ఉంది. రాజా సాబ్’ చిత్రం భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అని తెలిపారు.
