పయనించే సూర్యుడు: డిసెంబర్ 28: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఘనవిజయంగా సాగుతుందని దాంట్లో భాగంగా ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల్ల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ (డీసిసి) కార్యాలయంలో జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా,బీసి మంత్రిత్వ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీసిసి అధ్యక్షుడు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు వెంకట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, వివిధ హోదాల్లా ఉన్న నాయకులతోపాటు ఆయన హాజరయ్యారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ హుజురాబాద్ నుండి అధిక స్థానంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎన్నికయ్యారని నిధులు కోయిఠాయించే విషయంలో ఎక్కువ నిధులు హుజురాబాద్ కేటాయించాలని కోరారు. హుజురాబాద్ లో ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఎన్ని ప్రచారాలు చేసిన కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఆపలేకపోయాయని ఇదే స్ఫూర్తిని ప్రభుత్వం నుండి వచ్చే పనులను సంక్షేమ పథకాలు ప్రజలు అందించేలా కృషి చేసేలా కృషి చేస్తామని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన అధిక సంఖ్యలో గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.